కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. భావోద్వేగాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో భాగంగా ధనుష్ మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు..
Also Read :Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
ధనుష్ హీరోగానే కాకుండా, మంచి దర్శకుడు, సింగర్ అనే విషయం తెలిసిందే.. అయితే ఈ ఈవెంట్‌లో హోస్ట్ సుమ తెలుగులో ఒకవేళ దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు? అని ప్రశ్నించగా ధనుష్ వెంటనే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ పేరు చెప్పారు. దీంతో ఆ సభాస్థలి అంతా మారుమోగిపోయింది. ఇంతకు ముందు కూడా పవన్‌కి ధనుష్ అభిమాని అని చెప్పడం జరిగింది. అలాంటిది ఇపుడు తనకి పవన్‌ని దర్శకత్వం వహించాలని ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసింది. మరి నిజంగానే వీరి కలయికలో సినిమా పడితే ఎలా ఉంటుంది.
