Site icon NTV Telugu

స్టార్ హీరో డైరెక్షన్ లో తలైవా 170వ మూవీ ?

Dhanush To Direct Rajinikanth 170th film

సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా కథనం ప్రకారం ఇప్పుడు రజినీకాంత్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయట. వాటిలో ఒక చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు. 

Read Also : “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !

రజినీకాంత్ 169వ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.  ఇక జరుగుతున్న ప్రచారం మేరకు రజినీకాంత్ 170వ చిత్రానికి ఆయన అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇకఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాగా ధనుష్ “పవర్ పాండి” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన రెండవ చిత్రానికి అతి త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు నటుడు ఇటీవల వెల్లడించారు. అయితే ఆయన ప్రకటించిన చిత్రం రజినీకాంత్ తోఎం అంటున్నారు. రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.  

Exit mobile version