ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.
Also Read : MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్.. రవితేజ కోసం పవన్ కళ్యాణ్..?
గత నెలలో రిలీజ్ అయిన రాయన్ నిన్నటితో 15 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుంది. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.2.1 కోట్లకు రాయన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసారు బయ్యర్స్. రిలీజ్ అయిన మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకుంది. 15 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం: 3.24 కోట్లు, సీడెడ్: 76లక్షలు, ఉత్తరాంధ్ర: 75లక్షలు, తూర్పు: 42లక్షలు, పశ్చిమ: 31లక్షలు , గుంటూరు: 51లక్షలు, కృష్ణ: 49లక్షలు , నెల్లూరు: 27 లక్షలు కలిపి ఏపీ/ టీజీ మొత్తం:- 6.75 కోట్ల రూపాయల షేర్ (13.20) కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చి పెటింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 141.06 కోట్ల గ్రాస్ రాబాట్టింది. ధనుష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించి అభిమానులను స్వయంగా భోజనం వడ్డించాడు ధనుష్. అటు తమిళ్ లోను ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్స్ సాధించిన సినిమాగా రాయన్ మొదటి ప్లేస్ లో నిలిచింది.
Actor #Dhanush @ #Raayan Success Meet @dhanushkraja pic.twitter.com/SmS7M8psAS
— Sathish Kumar M (@sathishmsk) August 10, 2024