Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అమరన్’తో అటు తమిళనాటతో పాటు ఇటు తెలుగునాట కూడా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘రాజకుమార్ పెరియాసామి’ ‘ధనుష్’ 55వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘మెగాస్టార్ మమ్ముట్టి’, ‘సాయి పల్లవి’, ‘శ్రీలీల’, ‘సాయి అభ్యంకర్’ వంటి స్టార్స్‌ను పెట్టి, భారీ ఆలయ సెట్స్ మధ్య తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే సమయంలో హీరో ‘ధనుష్’ తన కొడుకును లాంచ్ చేసే అవకాశం ఆ డైరెక్టర్‌కు ఇచ్చాడని, చెన్నై చిత్ర పరిశ్రమలో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
యాక్టింగ్, ఫైటింగ్, డాన్స్ ఇలా అన్ని స్కిల్స్‌లో ప్రస్తుతం ఫారిన్ కంట్రీస్‌లో తర్ఫీదు పొందుతున్న ‘యాత్ర రాజా’, తన తండ్రిలాగే హీరో కావాలని ఎప్పట్నుంచో బలమైన కోరికతో ఉన్నాడంట. అయితే హీరో ‘ధనుష్’కి అప్పుడే తన కొడుకుని హీరో చెయ్యాలని లేదంట. ఇక ఇదే విషయంపై ఓ ఈవెంట్లో ‘ధనుష్’ మాట్లాడుతూ “నేను 16 ఏళ్ళకే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వాడికి 19 ఏళ్ళు మాత్రమే. అయినా సరే వాడు నా కంటికి చిన్నపిల్లోడిలానే కనిపిస్తాడు. ఏది ఏమైనా అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు” అంటూ తన కొడుకు ఎంట్రీకి ఏమంత తొందర లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
Also Read
అయితే కోలీవుడ్ మీడియా మాత్రం, కాసేపు ధనుషే తన కొడుకును పెట్టి సినిమా తీస్తున్నాడని, లేదు లేదు వేరే డైరెక్టర్‌ను పెట్టి మంచి కథను సిద్ధం చేయిస్తున్నాడని పూటకో వార్తను పుట్టిస్తోంది. ఏది ఏమైనా మేనల్లుడు ‘పవిష్ నారాయణ్’ను వెండితెరకు సొంత కథతో పరిచయం చేసిన ‘ధనుష్’, కొడుకు యాత్రను పరిచయం చేసేందుకు వంద రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఇక ‘ధనుష్’ను తన తండ్రి, అదే అప్పటి లీడింగ్ డైరెక్టర్ ‘కస్తూరి రాజా’నే వెండితెరకు పరిచయం చేశారు. ఇక్కడ తెలుగులో ‘జూనియర్స్’గా రీమేక్ అయిన ‘అల్లరి నరేష్’ మూవీని ఒరిజినల్‌గా తమిళ్లో చేసింది ‘ధనుషే’. ఆ మూవీకి ‘ధనుష్’ సోదరుడు ‘సెల్వరాఘవన్’ సైతం చక్కటి స్క్రీన్‌ప్లే, రచన సహకారం కూడా అందించడం జరిగింది. అంతేకాదు, ఆ తరువాత ‘ధనుష్’కి ‘సెల్వరాఘవన్’ ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’ వంటి బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. ఆ తరువాతే ‘ధనుష్’ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోగలిగాడు.
కాబట్టి, తన కెరీర్‌లాగే కొడుకు కెరీర్ కూడా హిట్స్‌తో ఆరంభం కావాలని, తన తండ్రిలాగే ‘యాత్ర రాజా’ ఫస్ట్ ఫిల్మ్‌ను తానే డైరెక్ట్ చేస్తాడో? లేదా కేవలం ప్రొడ్యూస్ చేసి వేరే డైరెక్టర్‌కి అవకాశం ఇస్తాడో? తెలియాలంటే ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!