OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?

Dhanush Sai Pallavi Om

Dhanush Sai Pallavi Om

OM Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ ఫేమ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘ఓం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్‌ను ‘ఓ.0’ (O.M) గా మార్చబోతున్నారనే బజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు తలెత్తడంతోనే మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఇలాంటి సెన్సార్ మార్పు ఇదే మొదటిసారి కాదు. గతంలో దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) సినిమా విషయంలోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఒక గ్యాడ్జెట్ రిఫరెన్స్‌లో ‘OM’ అనే పదాన్ని వాడగా, సెన్సార్ అభ్యంతరాల కారణంగా దాన్ని ‘MM’ గా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ధనుష్ సినిమా టైటిల్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యిందని చెబుతున్నారు.

అయితే, ఈ సినిమాకు అసలు ‘ఓం’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? దీనికి ఆధ్యాత్మికతకు లేదా పరమశివుడికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతోంది. దీనిపై డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ ప్రధానంగా రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరువణ్ణామలై పట్టణాల మధ్య సాగుతుందట. అంతేకాకుండా, ఇందులో హీరోయిన్ సాయి పల్లవి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఒక ఆపరేషన్ కోడ్ నేమ్ ‘OM’ అని, కథలోని పాత్రల జీవితాల్లో ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు ‘OM’ అనే టైటిల్ పెట్టినప్పటికీ, సెన్సార్ రూల్స్ దృష్ట్యా దాన్ని ‘O.M’ గా మారుస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టైటిల్ మార్పుపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.