ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. గత నెల్ 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చినా స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం ఒక వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చడంతో రాయన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది.
Also Read: Kerala floods: వయనాడ్ బాధితులకు బాధ్యతగా బన్నీ.. సాయం ఎంతంటే..?
రాయన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. రూ. 46 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం 9 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 114.50 కోట్ల రూపాయల గ్రాస్, రూ.54.35 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్సఫీస్ చరిత్రలో ‘A’ రేటింగ్ సినిమా వంద కోట్లు సాధించిన సినిమాల సరసన 3వ స్థానంలో నిలిచి ధనుష్ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం రూ .8.35 కోట్ల లాభాలు సాధించింది.
Also Read: Cinema News : సోషల్ మీడియాలో ట్రోలింగ్ లో ట్రెండింగ్ ఉన్న స్టార్ హీరో..?
‘రాయన్’ తమిళ్ తో పాటు తెలుగులోను విడుదలైంది. కొంత మిశ్రమ స్పందన వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. గత శనివారానికి రాయన్ విడుదలై 9 రోజులు పూర్తిచేసుకుని డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. టాలీవుడ్ లో 9 రోజులకు గాను 5.80 కోట్ల రూపాయలు షేర్ 11.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ. 5కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో దిగిన రాయన్ ప్రస్తుతం లాభాలలోకి ఎంటర్ అయింది. నేడు వీకెండ్ కావడంతో మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది.