Site icon NTV Telugu

Dhanush: హైదరాబాద్ ‘పార్క్’లో సందడి చేయనున్న రాయన్..ఎప్పుడంటే..?

Untitled Design (6)

Untitled Design (6)

తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండేలా వున్నాయి. సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. ఎస్ జే SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రామాయణం, మహాభారతం తరహా హై పాయింట్‌లను సినిమా అంతటా పొందుపరిచారని సమాచారం.

కాగా రాయన్ ను తమిళ్ తో తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నాడు ధనుష్. షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ధనుష్. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 21న పార్క్ హయత్ హోటల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో ధనుష్ తో పాటు సందీప్ కిషన్ తదితరులు పాల్గొననున్నారు. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రానున్న రాయన్ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సినిమాస్, సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా కొనుగోలు చేసారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రానున్న రాయన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

Also Read: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్

Exit mobile version