Dhanush : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్‌

Dhanush

Dhanush

వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా క్రేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. తమిళ్ లో మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘తమిళరసన్ పచ్చముత్తు’ ఈసారి ధనుష్‌ కోసం ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. సూర్యదేవర నాగవంశీ సారథ్యంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికే తెలుగుతో పాటు పాన్-ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ‘సార్’ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి విజయాన్ని అందించిన ఈ బ్యానర్ మళ్లీ ధనుష్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాను బైలింగ్వెల్‌గా లేదా పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ధనుష్‌ మార్క్ పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్, తమిళరసన్ పచ్చముత్తు మార్క్ టేకింగ్, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.