ప్రస్తుతం ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఓకే చేయడానికి కొంత మంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండి అంటూ ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. కానీ ఎంత మొత్తుకున్నా కొంత మంది హీరోలకి అంత స్పీడ్ రాదు అనడానికి హీరో ధనుష్‌ను ఉదాహరనగా తీసుకోవచ్చు.
Also Read:Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు
అంటే ఫీలయిన కానీ ఇదే నిజం. ఎందుకంటే ధనుష్ ప్రజంట్ శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తుండగా, తన సొంత డైరక్షన్‌లో ‘ఇడ్లీ కడై’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అక్టోబరులో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇది కాకుండా శేఖర్ కమ్ములతో మరో సినిమా ఓకే చేశాడట. ఈ లెక్కన్న చూసుకుంటే ధనుష్ చేతిలో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. అది కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అంతేకాదు దర్శకుడు మారి సెల్వరాజ్ – ధనుష్ మరోసారి కలిసి నటించబోతున్నారట. తాజాగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి అంటూ సినిమా కథను కాస్త రివీల్ చేశారు. దీంతో మన హీరోలు ఇలా ఎప్పుడు వరుస సినిమాలు చేస్తారో అనే కామెంట్ వినపడుతున్నాయి. సినిమాను అనౌన్స్ చేసి వదిలేయడం కాదు సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి అనే మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.