Dhanush -Aishwaryaa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను పంచుకుంటూ స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తున్న ఈ జంటపై ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ధనుష్ మళ్లీ రజినీకాంత్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నారని, వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారారు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్. త్వరలోనే జరగనున్న అనిరుధ్ పెళ్లి వేడుకలకు ధనుష్, ఐశ్వర్య కలిసి హాజరుకానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ధనుష్, అనిరుధ్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ విభేదాలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టి, అనిరుధ్‌తో ధనుష్ మళ్లీ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
మరోవైపు రజినీకాంత్ కుటుంబంతోనూ ధనుష్ పాత గొడవలను పక్కనపెట్టి చాలా సాధారణంగా కలిసిపోతున్నట్లు సమాచారం. పిల్లల భవిష్యత్తు కోసమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ధనుష్ – ఐశ్వర్య మధ్య సాన్నిహిత్యం మళ్లీ పెరుగుతోందనే చర్చ జోరందుకుంది. అనిరుధ్ పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపిస్తే మాత్రం వీరి రీ-యూనియన్ వార్తలకు మరింత బలం చేకూరినట్లే అవుతుందని అంటున్నారు. అటు సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్యాచ్అప్, ఇటు ఐశ్వర్యతో మళ్లీ ఒక్కటవుతారనే ప్రచారం.. ఈ రెండు అంశాలు ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

