NTV Telugu Site icon

Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..

Untitled Design (10)

Untitled Design (10)

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.  ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ  నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దేవర థియేట్రికల్ రైట్స్ అవుట్ రేట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలు ఆయన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేస్తుండగా మరికొన్ని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకాలు చేస్తున్నారు. రేషియోల వారీగా చుస్తే దేవర ఆంధ్ర ఏరియా ( సీడెడ్ కాకుండా ) రూ. 55 కోట్ల కు సేల్ చేశారు. ఇక తెలంగాణ నైజాం ఏరియాలో రూ. 42 కోట్లు గా నిర్ణయించారు. ఖర్చులు, జిఎస్టీలు, కమిషన్స్ వీటికి అదనం. నైజాం లో దేవరను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి పంపిణి చేయనున్నారు. నెల్లూరు అంజలి పిచ్చర్స్ భాస్కర్ రెడ్డి ( రూ. 5.40 కోట్లు ) , తూర్పు గోదావరి  విజయలక్ష్మి ఫిల్మ్స్ ( రూ. 9.60 కోట్లు ), కృష్ణ ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ( రూ. 8.40 కోట్లు ) , సీడెడ్ కూడా ధీరజ్ కు ఇచ్చారు రేషియో ఫిక్స్ చేయలేదు. ఇక బాలీవుడ్ లో  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ రూ. 60 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు.