Site icon NTV Telugu

Devisri Prasad: ‘ఎల్లమ్మ’ లో దేవిశ్రీప్రసాద్ జోడిగా స్టార్ బ్యూటీ ఫిక్స్!

Keerthy Suresh Movie, Devi Sri Prasad Acting, Ellamma

Keerthy Suresh Movie, Devi Sri Prasad Acting, Ellamma

సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. అవును! ప్రముఖ సంగీత దర్శకుడు నటుడిగా పరిచయం కాబోతున్న సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేం వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేసే ఆలోచన చాలా కాలంగా తిరుగుతూనే ఉంది. పలు దర్శకులు ఆయనకు కథలు వినిపించినా, ఆయన ఎప్పుడూ సంగీతం పైనే దృష్టి పెట్టారు. అయితే ఈసారి మాత్రం ‘ఎల్లమ్మ’ కథ వినగానే ఆయనకు నచ్చేసిందట. చివరికి ఆయన హీరోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అయితే ఇక ఈ సినిమాలో హీరోగా నాని, నితిన్, ధనుష్ వంటి నటుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, కానీ చివరికి అది దేవిశ్రీ దగ్గరే ఫైనల్ అయిందని చెబుతున్నారు. ఈ సినిమా ఒక సోషియల్ – ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే తాజాగా ఈ మూవీలో దేవి కి జోడిగా కథానాయికగా కీర్తి సురేష్ ఎంపికైనట్టు సమాచారం. అంటే దిల్‌రాజు సంస్థతో కీర్తి ఒకటి విజయ్ దేవరకొండ సరసన, మరొకటి ఈ ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ కలిపి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. అన్నీ కుదిరితే, దేవిశ్రీ – కీర్తి జోడీని ప్రేక్షకులు పెద్ద తెరపై చూడబోతున్నారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్, నటన – రెండూ కలిసి వస్తే, ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి అభిమానుల్లో పెరుగిపోయింది.

Exit mobile version