Site icon NTV Telugu

Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?

Untitled Design (40)

Untitled Design (40)

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన  పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read : Devara : దేవర స్పెషల్ షో చూసిన కొందరు ప్రముఖులు.. టాక్ ఏంటంటే..? 

తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ ను 11.07 గంటలకు రిలీజ్  చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ సడెన్ గా ట్రైలర్ రిలీజ్ ను అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్  చేస్తున్నామని అధికారంగా వెల్లడించారు. రిలీజ్ ఎప్పడు అనేది మరికొన్ని గంటల్లో ప్రకటిస్తామని తెలిపారు. దింతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. ఊరించి ఉసూరుమనిపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు వచ్చిన విధ్వంసం సృష్టించడం మాత్రం పక్కా అని సమాచారం. ట్రైలర్ ను ఓ రేంజ్ లో కట్ చేసారని విశ్వసనీయస్ సమాచారం. మంచి ముహూర్తం చూసుకుని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. కాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎటువంటి మార్పులు లేవు, యధావిధిగా అనుకున్న సమయానికి జరగనుంది. సాయంత్రం ఈవెంట్ లో తారక్ ఎం మాట్లాడతాడు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version