NTV Telugu Site icon

Devara: దేవర ట్రైలర్ రివ్యూ.. ఇదేంటి ఆ సినిమాలు గుర్తొస్తున్నాయ్?

Devara

Devara

Devara Trailer Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ అప్పుడే రెండు పోలికలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాతో పాటు దమ్ము సినిమా గుర్తుకు తెచ్చేలా ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రావాలా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకుల్లాగా ఇప్పటికే కనిపించాడు. ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తోంది.

iPhone 16: ఐఫోన్ 16 @ ‘మేక్ ఇన్ ఇండియా’.. మనదేశం నుంచే ప్రపంచానికి ఎగుమతి..

దమ్ము సినిమాలో కూడా పిరికి వాడి పాత్రలో కనిపించాడు ఇందులో వరా అనే క్యారెక్టర్ లో అలాగే కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసిందే కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాలో కొత్తగా ఏముందా అనే అనుమానాలను ట్రైలర్ రేకెత్తిస్తోంది. సినిమా కోసం సముద్ర తీర నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అది కూడా మనం ఛత్రపతి లాంటి సినిమాల్లో చూశాం. సరే అయితే అసలు ఆ దొంగల గుంపుకు దేవరకు సంబంధం ఏంటి? లాంటి విషయాలను ఎలా చూపించారు అనేది ఇప్పుడు సినిమాకి ప్రధానమైన పాయింట్. ఆ విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగితే సినిమా హిట్ అవుతుంది. అయితే ఎందుకో కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాగానే అనిపిస్తున్న చాలామందికి మాత్రం కొరటాల ఏమైనా తేడా చేస్తున్నాడేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. దానికి తోడు రాజమౌళి తర్వాత సినిమా దారుణమైన డిజాస్టర్ కావడం అనే సెంటిమెంట్ ఎలాగో భయపెడుతూనే ఉంది కాబట్టి ఈ ట్రైలర్ చూస్తున్న ఎందుకో తేడాగా ఉందే అని అనిపిస్తోంది కొంతమందికి. అయితే టెక్నికల్ గా చూస్తే విజువల్స్ అదిరాయి. కొన్ని యాక్షన్ సీన్స్ రచ్చ రేపాయి. విజువల్స్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి.

ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ డైలాగులు
కులం లేదు.. మతం లేదు.. భయం అసలే లేదు
ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి
రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ >>> మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత దైర్యం కాదు, కాదూ కూడదు అని మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా
దేవరను చంపాలంటే సరైన సమయం కాదు సరైన ఆయుధం దొరకాలి
వాడికి వాళ్లయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే
పని మీద పోయినోడు అయితే పనవ్వగానే వస్తాడు.. పంతం పట్టిపోయాడు నీ కొడుకు