NTV Telugu Site icon

Devara : రికార్డులు జాగ్రత్తమ్మా.. టైగర్ వేట మొదలవుతోంది!

Devara

Devara

Devara Trailer Eyeing on Records to Break: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ ఫియర్ సాంగ్‌తోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో దేవర బుకింగ్స్ ఓపెన్ కాగా.. తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. USAలో అత్యంత ఫాస్ట్‌గా 15 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవర రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక్కడితో దేవర రికార్డుల వేట మొదలైనట్టే. బుకింగ్స్ పరంగానే కాదు.. ట్రైలర్‌తో డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు కాబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 10న రానున్న ట్రైలర్‌.. ఇప్పటి వరకున్న టాలీవుడ్ డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే.. టైగర్ అసలు సిసలైన వేట మాత్రం దేవరతోనే స్టార్ట్ కానుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు వంద కోట్ల ఓపెనింగ్ సినిమా లేదు.

Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!

ఆర్ఆర్ఆర్ డే వన్ 223 కోట్లు రాబట్టింది.. కానీ, ఆ క్రెడిట్ ఎన్టీఆర్ ఒక్కడికే ఇవ్వలేం. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ కాబట్టి.. ఏ రికార్డ్ అయినా సరే చరణ్, తారక్‌ ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ దేవర నుంచి ఎన్టీఆర్ సోలో రికార్డ్స్ నమోదు కాబోతున్నాయి. ఈ సినిమా పై ఉన్న హైప్ ప్రకారం.. ఫస్ట్ డే ఖచ్చితంగా వంద కోట్లకు పై ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ. ఇప్పటికే దేవర ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అంటూ.. సోషల్ మీడియాలో ప్రిడిక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ లెక్క ప్రకారం.. దేవర మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 130 నుంచి 150 కోట్ల రేంజ్‌లో గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. అది దేవర ట్రైలర్, ప్రమోషన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే.. తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. హిందీలో గట్టిగా రాబట్టాల్సి ఉంటుంది. అయినా కూడా.. దేవర హైప్‌కు ఇక్కడితో ఎన్టీఆర్ వంద కోట్ల ఓపెనర్‌గా మారబోతున్నాడనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర ఏం చేస్తుందో చూడాలి.

Show comments