NTV Telugu Site icon

Devara: టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!

Daavudi Song

Daavudi Song

Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు, రెండు సాంగ్స్ సినిమాని వేరే లెవెల్ లోకి తీసుకు వెళ్ళగా ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్లు. దావుడి అని సాగనున్న ఈ సాంగ్ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది.

Nani Odela 2: దయచేసి ఆపండి.. పుకార్లపై నాని సినిమా టీం సీరియస్

ఈ థర్డ్ సింగిల్ జాన్వి కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక మాస్ బీట్ లాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక మెలోడీ సాంగ్ చుట్టమల్లే ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టి నూటపాతిక మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మాస్ పెప్పీ నంబర్ రిలీజ్ చేస్తున్నారంటే అది ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పలు భాషలకు చెందిన స్టార్ నటీనటులు నటిస్తున్నారు.

Show comments