యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఈ సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. . ఇక సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
Also Read: Pushpa – 2: చిరు హీరోయిన్ తో అల్లు అర్జున్ స్టెప్పులు.. దంచి కొట్టుడే..
దేవరలో ఎన్టీఆర్ కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సైఫ్ అలీఖాన్ లుక్ మంచి స్పందన రాబట్టింది. ఆగస్టు 15న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో చిన్నపాటి వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నటు తెలుస్తోంది. సైఫ్ ఈ చిత్రంలో భైర అనే పాత్రలో కనిపించనుండగా, ఈ పాత్రకు దేవర పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందట. ఈ సినిమలో సైఫ్ తో పాటు మరోక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా నటించబోతున్నాడు. దేవర పార్ట్ -2కు హింట్ ఇస్తూ బేబీ డియోల్ పాత్ర ముగుస్తుందని సమాచారం. ప్రస్తుతం బాబీ డియోల్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఈ ఆగస్టు చివరి నాటికి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుందని యూనిట్ టాక్. ఆ వెంటనే పాన్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. “దేవర” మొదటి భాగం సెప్టెంబర్ 27న దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.