Site icon NTV Telugu

Devara : దేవర స్పెషల్ షో చూసిన కొందరు ప్రముఖులు.. టాక్ ఏంటంటే..?

Untitled Design (39)

Untitled Design (39)

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర మాత్రమే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటు ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. కల్కి తర్వాత భారీ సినిమాలు ఏవి లేకపోవడంతో వాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడుదేవర ఆ గ్యాప్ కవర్ చేసి కలెక్షన్స్ కొల్లగొడుతుందని టాలీవుడ్ భావిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్సు బుకింగ్స్ లో దేవర అదరగొడుతుంది.

Also Read : VenuYeldandi : ‘బలగం వేణు’ కథలో బలం లేదా.. యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చేనా..?

టాలీవుడ్ లో ఇప్పడూ ఏ ఇద్దరిని పలకరించిన దేవర గురించే టాపిక్. సెన్సార్ టాక్ ఏంటి, ఇన్ సైడ్ టాక్ ఏంటి ఇలా ఒకటే డిస్కషన్స్. ఈ నేపథ్యంలో మరొక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయింది. జూనియర్ ఎన్టీయార్, రాజమౌళి కి సన్నిహితుడు ఒకరు నిన్న దేవార స్పెషల్ షో సినిమా చూసారని తెలిసింది. సినిమా చూసిన అతను చివరి అరగంట అదిరిందిపోయిందని, అసలు ఊహించలేదని, ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రేట్ లా ఉందని, సెకెండ్ హాఫ్ చాలా బాగుందని అయన సన్నిహితులకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారనే వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో అటు ఆంధ్రాలోని కొన్ని ఙిల్లాల నుంచి ఫోన్ ల తాకిడి ఎక్కువైంది. ఫ్యాన్స్ సంఘాల నుండి ప్రముఖ పిఆర్వోలకు ఒకటే కాల్స్ మెసేజెస్. సినిమా చూసింది ఎవరు, హైర్ లు వేసుకోవచ్చా ఏంటి పరిస్థితి అని ఇలా రకరకాలుగా ఒకటే హడావిడి. ఏది ఏమైనా దేవర మానియా ఇప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఉపేస్తోందనడంలో సందేహం లేదు

Exit mobile version