Site icon NTV Telugu

Devara : నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?

Untitled Design

Untitled Design

జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఇప్పటికే దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి

ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో దేవరా ప్రీమియర్స్ 2మిలియన్ డాలర్ మార్క్ దాటింది. RRR తర్వాత 2M ప్రీమియర్ గ్రాసర్ & డే-1 ప్రీ సేల్స్‌ కలిపి 2.5M మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు 3 రోజులు ఉండగానే దేవర ఈ రేంజే బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చెసాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్ పై దేవర తుఫాను పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సర్వం సిద్ధమైంది. అయిదు నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ 2M కలెక్షన్స్ రాబట్టిన హీరోగా NTR మరొక రికార్డు క్రియేట్ చేసాడు.  కరెంట్ ట్రెండ్ చూస్తే ప్రీమియర్ డే  $2.5 నుంచి $3 మిలియన్, ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే నంబర్స్ నంబర్స్ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. టాక్ ఎలా ఉన్న సరే దేవర ఒకసారి చూసేయాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్, అందుకే నిదర్శనమే  నార్త్ అమెరికా దేవర బుకింగ్స్.

Exit mobile version