NTV Telugu Site icon

Devara Latest Update: స్టేజ్ మీద బారికేడ్లు.. ఎన్టీఆర్ తో మాట్లాడించే యత్నం?

Devara Pre Release Event

Devara Pre Release Event

Devara Pre Release Event Latest Update Barricades on Stage: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నోవోటెల్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే పాసులు ఉన్నవారు లేనివారు కూడా నోవోటెల్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ముందుగా నోవోటెల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈవెంట్ జరపడం కష్టం అంటూ నోవోటెల్ యాజమాన్యం చేతులెత్తేసింది. అయితే ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయస్ మీడియా సంస్థ ఎలా అయినా ఈవెంట్ జరపాలని కనీసం ఎన్టీఆర్ తో మాట్లాడించి పంపించేస్తామంటూ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు పోలీసులు ఈవెంట్ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చిన అభిమానులను వెనక్కి పంపే ప్రయత్నం చేశారు.

Devara: ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంతా సస్పెన్స్.. జరుగుతుందా? లేదా?

ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటూ అక్కడ బైఠాయించిన అందరినీ బయటికి పంపే ప్రయత్నం చేశారు. కొంతమంది ఫాన్స్ బయటకు వెళ్లడంతో ఇప్పుడు స్టేజ్ మీద బారికేడ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్. ఎవరూ స్టేజ్ ఎక్కకుండా బారికేడ్లు దృఢంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ ని తీసుకొచ్చి ఎన్టీఆర్ స్పీచ్ ఒక్కటి మాట్లాడించి ఈవెంట్ ముగించాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే చాలామంది అభిమానులను ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని చెప్పి బయటకు మాత్రం పంపించేశారు కాబట్టి కాస్త పరిస్థితులు ఇప్పుడు అదుపులోకి వచ్చాయని చెబుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ముఖ్య అతిథుల్లో ఒకరుగా ఉన్న త్రివిక్రమ్ నోవోటెల్ ప్రాంగణానికి వచ్చి క్యాన్సిల్ అయింది అని తెలియడంతో వెను తిరిగినట్లుగా చెబుతున్నారు.