NTV Telugu Site icon

Devara: దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..

Untitled Design

Untitled Design

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ.

ఓవర్సీస్ తో ఒకేసారి ఏపీ/టీజీ లో షోస్ ఒకే టైమ్ కి వేసేలా పక్కా పప్లానింగ్ తో వెళుతున్నాడు. 1.08 నిముషాలు కి  తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి, కాకినాడ పద్మప్రియ, రాజమండ్రిలోని గీతా అప్సర, అమలాపురం రమా టాకీస్, మండపేట రాజారత్నలో ప్రీమియర్స్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇటు కృష్ణ జిల్లాల్లో ట్రెండ్ సెట్, అలంకార్, శైలజ థియేటర్స్ లో తల్లవారు జామున షోస్ ప్లానింగ్ చేశారు. గుంటూరు రీజియన్ లో ఒంగోలులో గోపి కృష్ణ, గోరంట్ల కంప్లెక్స్, సత్యంలో భారీ గా స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. నెల్లూరు రీజియన్ లో కందుకూరు, దర్శి, కనిగిరి, నెల్లూరు టౌన్ లో వేకువ జామున షోస్ అగ్రిమెంట్స్ చేసారు. ఉత్తరాంధ్రలోని వైజాగ్ లో రికార్డు స్థాయి ప్రీమియర్స్ కు థియేటర్స్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. నందమూరి కంచుకోట సీడెడ్ లో డే -1 గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉంది దేవర. ఇక నైజాంలోని సుదర్శన్ 35, భ్రమరాంబమల్లికార్జున, విశ్వనాధ్, శ్రీరాములు, విమల్ థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ 1.08 షోస్ స్టార్ట్ చేస్తున్నారు.

Show comments