NTV Telugu Site icon

Janhvi Kapoor: పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్.. కానీ?

Janhvi Kapoor Devara

Janhvi Kapoor Devara

Devara Contract Clause for Janhvi Kapoor Clear for Pushpa 2: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తోంది. కమర్షియల్‌గా స్టార్ హీరోలకి తగ్గట్టుగా గ్లామర్‌ పరంగా కూడా ఆమె సరిగ్గా బ్యాలెన్స్ చేయగలదని దేవర సినిమా నుంచి ఇటీవల విడుదలైన “చుట్టమల్లె” పాట నిరూపించింది. అయితే ముందు నుంచి జాన్వీ కపూర్ చేత పుష్ప 2లో ఐటెమ్ నంబర్‌ చేయించాలని సుకుమార్ – అల్లు అర్జున్ భావిస్తూ ఉండేవారు. అయితే ఆమె దేవర ప్రొడక్షన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం దేవర విడుదలయ్యే వరకు ఆమె ఏ తెలుగు చిత్రంలో నటించకూడదు. రామ్ చరణ్ సినిమా కూడా లేట్ అవుతుంది కాబట్టి ఆమెకు ఇబ్బంది లేదు.

VV Vinayak: డైరెక్టర్ వీవీ వినాయక్ కి సర్జరీ? అసలేమైందంటే?

అయితే అల్లు అర్జున్ పుష్ప 2ని మొదట ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పుడు, ఈ ఒప్పంద నిబంధన ప్రకారం ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి అనుమతి లేదు. అయితే, ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్‌కు వెళ్ళింది. దేవర సెప్టెంబర్‌లో విడుదల అవుతుంది కాబట్టి ఆమె పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ చేసినా ఇబ్బంది ఉండదు. సుకుమార్ మరియు అల్లు అర్జున్ యానిమల్ బాభీ 2 నటి తృప్తి డిమ్రీని ఐటెం సాంగ్ కోసం అనుకున్నా ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి తగినంత బలమైన డ్యాన్సర్ కాదని వారు వెనక్కు తగ్గారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగంలో “ఊ అంటావా ఊ ఊ అంటావా” ఒక సంచలనం కాబట్టి అంతకు మించి అనిపించేలా ఒక హాట్‌నెస్‌తో కూడిన మంచి డ్యాన్సర్ కోసం వెతుకుతున్నారు. దానికి జాన్వీ కపూర్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప 2లో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ చేసే అవకాశం ఉంది. ఆమె “ఊ అంటావా ఊ ఊ అంటావా” లాంటి పెర్ఫార్మెన్స్ అందిస్తే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. ఇక ఆమె తెలుగు స్టార్ హీరోలందరికీ ఆమె అత్యంత డిమాండ్ ఉన్న నటి అవుతుందని చెప్పొచ్చు.

Show comments