Site icon NTV Telugu

Devara : ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ లో అనిరుధ్ రచ్చ.. మాములుగా లేదు.

Untitled Design (7)

Untitled Design (7)

బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్ పేరే చెప్పాలి. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్ళాడు. నార్మల్ సీన్స్ ను కూడా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో నిలబెట్టేసాడు అనిరుధ్

Also Read : Devara : ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న దేవర కటౌట్

కాగా దేవర ఇంటర్వ్యూ లో ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఉందని చెప్పిన అనిరుధ్ తమిళనాడులోని వెట్రి థియేటర్ లో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో బెన్ ఫిట్ షో కు హాజరయ్యాడు. సినిమాను చూస్తూ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేశాడు అనిరుధ్. అనంతరం వందలమంది అభిమానుల సమక్షంలో పాట పడుతూ ఫ్యాన్స్ కు ఎనర్జీ ఇచ్చాడు అనిరుధ్. వాసవానికి జూనియర్ ఎన్టీయార్ సినిమా అరవింద సమేత వీర రాఘవకు అనిరుధ్ సంగీతం అందించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా విడుదలైన దేవర తో అనిరుధ్ ఆ బాకీ తీర్చేసాడని చెప్పాలి. అనిరుధ్ సంగీతానికి యంగ్ టైగర్ డాన్సులకు థియేటర్లు మారుమోగాయి. ఫ్యాన్స్ మధ్య సినిమా చూస్తూ తమ సినిమాకు ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు అనిరుధ్.

 

 

Exit mobile version