NTV Telugu Site icon

Devara : ఆ ఒక్క కారణంగానే దేవరకు అన్ని వందల కోట్ల కలెక్షన్స్..

Devara Clct

Devara Clct

ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎన్టీయార్ తో సినిమా చేస్తున్నాడు అనగానే తారక్ ఫ్యాన్స్ ఆందోళ చెందారు. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు అని ప్రశ్నించారు. కానీ కొరటాలను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. దాదాపు రెండేళ్లు షూట్ చేసుకుని సెప్టెంబరు 27న రిలీజ్  అయింది దేవర. కట్ చేస్తే బెన్ఫిట్ షోస్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న దేవర నూన్ తర్వాత హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి సృష్టించింది. తారక్ నటనకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ తోడవడంతో దేవర నెగిటివ్ కామెంట్స్ ను సైతం పక్కకు నెట్టి వసూళ్ల వరద పారించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర ఓ రేంజ్ లో సాగింది.

Also Read :Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?

దేవర భారీ వసూళ్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 6 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 396 కోట్లు కొల్లగొట్టిందని పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ దేవర అదరగొట్టింది. ముఖ్యంగా సీడెడ్ వంటి ఏరియాలలో టాక్ తో సంబంధం లేకుండా 20 కోట్లకు పైగా షేర్ రాబట్టాడు దేవర. మొత్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వాసులు చేసింది దేవర. ఇటు ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో 5.4 మిలియన్ రాబట్టింది దేవర. ఈ కలెక్షన్స్ అన్ని కేవలం NTR అనే టైటిల్ తో మాత్రమే వచ్చాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

 

Show comments