NTV Telugu Site icon

Devara‌ : ఓవర్సీస్ లో ‘దేవర’ రికార్డులే రికార్డులు.. దేవర ముంగిట నువ్వెంత..

Untitled Design (27)

Untitled Design (27)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం దేవర. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కొరటాల శివ, ఎన్టీయార్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించడంతో దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..

కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ లో సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది దేవర. నార్త్ అమెరికా సేల్స్ చుస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్ లో 945 షోలకు గాను $810,048 రాబట్టింది. టికెట్స్ పరంగా చుస్తే 26K+ పైగా బుక్ అయ్యాయి.  USA లో అత్యంత ఫాస్ట్ గా 26 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. US ప్రీమియర్స్ కు ఇంకా 19 రోజులు ఉండగా దేవర ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం  ఒక రికార్డు అనే చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంగా $ 882,230 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ముంబై చేరుకున్నాడు యంగ్ టైగర్. అనిరుధ్ సంగీతం అందించిన దేవర ట్రైలర్ ను సెప్టెంబరు 10న ముంబై లో భారీ ఈవెంట్ లో లాంఛ్ చేయనున్నారు మేకర్స్.

Show comments