NTV Telugu Site icon

Deva: యాక్టర్లకు కూడా తెలియకుండా సినిమాకు మల్టిపుల్ క్లైమాక్స్ లు

Deva Movie

Deva Movie

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కల్ట్ అండ్ యాక్షన్ హీరోగా చేంజ్ అయ్యాడు బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్. కబీర్ సింగ్ హిట్ అతన్ని స్టార్ హీరోని చేసింది. లాస్ట్ ఇయర్ “తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా”తో మరో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఈ జనవరిలో దేవాతో వస్తున్నాడు. ఈ నెల 31న థియేటర్లలోకి రాబోతుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు షాహీద్. బాలీవుడ్ లో వరుస ప్లాపులతో సతమతమౌతున్న పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డేకు దేవా హిట్టు అత్యంత కీలకం. వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు వస్తోంది. ఈ సినిమా నార్త్ బెల్ట్ లో పడిపోయిన గ్రాఫ్ తిరిగి పొందుతానని హోప్స్ పెట్టుకుంది.

Nuvve Kavali: మూడు దేశాల్లో 50 లక్షల ఖర్చుతో మెహబూబ్, శ్రీ సత్యల ఆల్బమ్ సాంగ్

మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఇది. రాయ్ కపూర్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సిద్దార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ తెరకెక్కిస్తున్నారు. దేవా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లను షురూ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్లీ ట్రైలర్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాతలు. దేవా సినిమా కోసం మల్టీపుల్ క్లైమాక్సెస్‌ చిత్రీకరించినట్లు నిర్మాతలు తెలిపారు. ఇందులో విశేషమేమిటంటే.. క్లైమాక్స్ ఫైనల్ వర్షన్ ఏంటనేది… యాక్టర్స్, యూనిట్ కు కూడా తెలియదట. క్లైమాక్స్ ను అత్యంత గోప్యంగా ఉంచి.. ప్రేక్షకులకే కాదు టీమ్ కి కూడా క్యూరియాసిటీ కలిగిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్న దేవా.. సినీ లవర్స్ ను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.