Site icon NTV Telugu

Pawan Kalyan – NTR : ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Ntr Pawan

Ntr Pawan

ఢిల్లీ హైకోర్టులో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా దాఖలు చేసిన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) పిటిషన్లపై నేడు కీలక విచారణ జరిగింది. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలను వాణిజ్యపరంగా వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని సోషల్ మీడియా సంస్థలకు, ఈ కామర్స్ సంస్థలకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వినియోగించడం, మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది.

Also Read: Donald Trump: 2025లో ప్రపంచాన్ని భయపెట్టిన ఒక్క మగాడు.. 2026లోనూ ట్రంప్‌ ఇండియాను దెబ్బ కొడతారా?

నటుల తరఫున సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన పోస్టులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు, సామాజిక మాధ్యమాలు తమ క్లయింట్ల అనుమతి లేకుండా వారి ఇమేజ్‌ను వాడుకుంటున్నాయని తెలిపారు. ఈ కేసులో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఫిర్యాదు అందిన వెంటనే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కొన్ని కీలక సూచనలు చేసింది.

Also Read:Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?

లింకులను శాశ్వతంగా తొలగించే ముందు, ఆ లింకుకు సంబంధించిన వినియోగదారుడి వాదనలు కూడా వినాలని కోర్టు అభిప్రాయపడింది. ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో అభిమానుల ఖాతాల నుండి వచ్చే పోస్టుల విషయంలో.. అది అధికారికం కాదని స్పష్టం చేసే ‘డిక్లైమర్’ ఉండాలని సూచించింది. అభ్యంతరకర కంటెంట్ ఉన్న ఖాతాల గురించి సంబంధిత వినియోగదారులకు గూగుల్ సమాచారం ఇవ్వాలని, అవసరమైతే ఆ ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది. వివాదాస్పద పోస్టులకు సంబంధించి BSI, IP లాగిన్ వివరాలను మూడు వారాల్లోగా అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని భావించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను కాపాడటంలో ఈ తీర్పు ఇతర రంగాల ప్రముఖులకు కూడా ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది.

Exit mobile version