NTV Telugu Site icon

Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..

Following Venkatesh Daggubati (8)

Following Venkatesh Daggubati (8)

బాలీవుడ్ స్టార్ కపుల్  దీపికా పదుకొణె. , రణవీర్ సింగ్. 2018లో ఇటలీలోని లేక్ కోమోలో  దీపికా పదుకొణె, రణవీర్ సింగ్‌‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి  తర్వాత కూడా దీపికా పలు సినిమాలలో నటించింది. అటు రణ్వీర్ సింగ్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.పెళ్లైన నాలుగేళ్ళకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ దంపతులు. ఆ మధ్య కల్కి సినిమా ప్రమోషన్స్ లోనూ తన బేబీ బంప్ తోనే పాల్గొంది దీపికా. ఇటీవలే మూడు రోజుల క్రితం కూడా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి భర్త రణవీర్ సింగ్ తో కలిసి వెళ్ళి దర్శించుకుంది దీపికా.

Also Raed: ThalaivarVijay : విజయ్ పార్టీకి ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్.. ఇక మొదలెడదామా..

కాగా దీపికా శనివారం సాయంత్రం ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరింది. నేడు అనగా ఆదివారం దీపికా పండండి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఈ దంపతులకు అటు బాలీవుడ్ ప్రముఖుల నుండి ఇటు నెటిజన్స్ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ కలిసి మొదటి సారిగా రామ్ లీలా సినిమాలో అమర ప్రేమికులుగా నటించి ఆ తర్వాత రీయల్ లైఫ్ లోను ప్రేమికులుగా మారి, మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టి నేడు చిన్నారికి జన్మనిచ్చి తల్లితండ్రులుగా మారారు దీపీకా సింగ్ దంపతులు.

Show comments