Site icon NTV Telugu

Deepika : ప్రభాస్‌తో రెండు సినిమాలు వదిలేసి.. దీపికా ఎన్ని కోట్లు నష్టం బోయిందో తెలుసా?

Deepika Padukune

Deepika Padukune

బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ దీపికా పడుకొనే ప్రస్తుతం కెరీర్‌లో ఒక విచిత్రమైన మలుపును ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పాన్-ఇండియా చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించే గోల్డెన్‌ ఛాన్స్ రావడమే కాకుండా, ఆ రెండు ప్రాజెక్టులు ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ గా మారాయి. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉండగా, ఈ రెండు సినిమాల నుంచి దీపిక వైదొలగడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. ‘మన శంకర వరప్రసాద్’ నుంచి ఫస్ట్ ట్రీట్ ఎప్పుడంటే..

విశ్లేషకుల మాటల్లో, ఈ నిర్ణయం ద్వారా దీపిక కనీసం రూ.40 కోట్ల వరకు నష్టపోయిందని చెబుతున్నారు. ఆర్థిక లాభాలు పక్కన పెడితే, ఇండస్ట్రీలో హాట్ సీట్‌లో ఉన్న ఇద్దరు టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోవడం మరింత దురదృష్టకరమని భావిస్తున్నారు. దీపిక తాను వ్యక్తిగత సౌకర్యానికి భంగం కలిగే విధంగా షూటింగ్స్ చేయలేనని చెప్పడం వల్లే ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం పై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “షారూఖ్ ఖాన్‌తో ఆరు సినిమాలు చేశాను” అని గర్వంగా చెప్పుకున్న దీపిక, ఇప్పటికీ ఓల్డ్ స్కూల్ హీరోలకే ప్రాధాన్యం ఇస్తోందని సెటైర్లు వేస్తున్నారు. షారూఖ్ వయసు త్వరలోనే 60 దాటుతుందని గుర్తుచేస్తూ, 45 ఏళ్ల హీరో ప్రభాస్‌తో వర్క్ చేసే ఛాన్స్ వదిలేయడం అవివేకమని చాలా మంది అంటున్నారు.

ఇక మరోవైపు, ఈ రెండు చిత్రాల నుంచి తప్పుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర పెద్ద బ్యానర్ల నుంచి కూడా అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు, ఈ నిర్ణయం కారణంగా రూ.100 కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో కాస్త కష్టకాలంలో ఉన్న దీపిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా పెద్ద తప్పు కాదా అనే ప్రశ్న ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక ప్రభాస్‌ మరోసారి ఆమెకు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. కానీ ఈ సంఘటన తర్వాత దీపిక బ్రాండ్, ఎండార్స్‌మెంట్స్‌, మార్కెట్ విలువపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Exit mobile version