Site icon NTV Telugu

Prabhas: మరోసారి ప్రభాస్‌తో దీపికా?

Deepika Padukone Prabhas

Deepika Padukone Prabhas

బాలీవుడ్‌లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్లో ఉంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె త్వరలోనే మళ్లీ షూటింగ్‌లలో బిజీ కాబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె మరోసారి ప్రభాస్‌తో జతకట్టబోతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న స్పిరిట్ సినిమాలో నటించమని ఇప్పటికే ఆమెను కోరినట్లు తెలుస్తోంది.

Read More:Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్ సూర్య

దానికి ఆమె ఒప్పుకుని, ఇటీవలే సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె గురించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేయబోతున్నారు. నిజానికి, ప్రభాస్ మరియు దీపికా పదుకొణె కలిసి కల్కి 2898 ఏడి సినిమాలో కనిపించారు. వీరిద్దరూ అందరూ జతకట్టకపోయినా, ఒక సినిమాలో కలిసి పనిచేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా పట్టాలెక్కనుంది. అయితే, ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాలో కలిసి నటించబోతోంది దీపికా.

Read More:Sudheer Babu : ‘జటాధర’ మూవీలో మహేష్ బాబు మరదలు..!

స్పిరిట్ సినిమాను టి-సిరీస్‌తో పాటు భద్రకాళి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించబోతోంది. ఈ భద్రకాళి ఫిల్మ్స్ అనే సంస్థను సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించబోతున్నారు.

Exit mobile version