NTV Telugu Site icon

Deepika Padukone : మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు

Deepika Padukune

Deepika Padukune

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006‌లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో సినిమాలో వివిధ పాత్రలని పోషిస్తు ప్రజంట్, అగ్ర హీరోయిన్‌లో ఒకరుగా కొనసాగుతు వస్తుంది దీపిక. ఇక గత సంవత్సరం ప్రభాస్ తో ‘కల్కి 2898 ఏడి’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇక్కడ కూడా తన సత్తా చాటింది.

Also Read: Vaishnavi : టిల్లు ‘జాక్’ తో హిట్ ఆదుకుంటుందా..!

అయితే రీసెంట్‌గా దీపికా ఇనిస్టాగ్రమ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో ఆమె ప్రపంచ సినీ మేకర్స్,నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘చాలాసార్లు మనకి రావాల్సిన ఆస్కార్‌ని లాగేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి, కానీ వాటికి రావాల్సినంత ప్రత్యేక గుర్తింపు మాత్రం రాలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ కి ఆస్కార్‌ని ప్రకటించగానే అక్కడే ఉన్న నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నాకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక భారతీయురాలిగా ‘ఆర్ ఆర్ ఆర్’ కి ఆస్కార్ రాగానే ఎంతో ఆనందం వేసింది. ఇక ఈ ఏడాది ‘ది బ్రుటలిస్టు’ చిత్రానికి అడ్రిన్ బ్రాడి ఉత్తమ నటుడుగా నిలిచినందుకు కూడా ఎంతో ఆనందం వేసిందని చెప్పుకొచ్చింది’ ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.