Site icon NTV Telugu

Deepika-Prabhas : ప్రభాస్ తో మూవీ అయితే 8 గంటలు.. SRK దగ్గర మాత్రం ఎన్ని గంటలైనా ఓకేనా?

Prabas Deepika

Prabas Deepika

కల్కి 2 మరియు స్పిరిట్ చిత్రాల నుండి దీపికా పదుకొణె వైదొలగడం గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. వర్కింగ్ అవర్స్ ఇష్యూ. పని గంటల విషయంలోనే ఈ భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడానికి కారణమని అప్పటి నుంచే వార్తలు రాగా, దీపిక కూడా ఇటీవల పరోక్షంగా అదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ ఈవెంట్‌లో మాట్లాడిన దీపికా “నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కుటుంబం, అభిమానులు ఇచ్చే ప్రేమే విమర్శలను తట్టుకునే బలం” అని చెప్పింది. ఇదే విషయంపై మరోసారి ఆమె క్లారిటీ ఇస్తూ పని గంటలపై తన స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడించింది.

Also Read : Varanasi Glimpse: త్రేతాయుగ సీన్‌తో ‘వారణాసి’ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ హైప్

దీపిక మాట్లాడుతూ..“మనందరం ఎక్కువగా పని చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాం. ఎక్కువగా శ్రమించడం అంటేనే నిబద్ధత అని అనుకుంటున్నాం. కానీ ఇది నిజం కాదు. ఒక మనిషి రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తాం. ఎక్కువ పనిచేసి అనారోగ్యం పాలైతే ఆ అదనపు గంటలకి విలువే ఉండదు” అని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక కొత్త వివాదం రగిలింది ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు..

“SRK దగ్గర రూల్స్ మారిపోతాయా?” “కల్కి 2 వద్ద 8 గంటల పని డిమాండ్ పెడితే తప్పుకుంటావు.. SRK సినిమా దగ్గర మాత్రం రూల్స్ వేరేలా?” “SRK కోసం 8 గంటలు సరిపోతాయా? లేక అక్కడ మాత్రం ఎన్ని గంటలైనా ఓకే?” “కల్కి నుంచి బయటకు రావడానికి కారణం వర్కింగ్ అవర్స్ కాదు అటిట్యూడ్!” “ప్రభాస్ సినిమా వదిలి SRK సినిమా కోసం సర్దుబాటు చేస్తావా?” అంటూ రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇండస్ట్రీలోని పలువురు మాత్రం దీన్ని నార్మల్‌గానే చూస్తున్నారు. తల్లి అయిన తర్వాత దీపిక తన వర్క్ స్టైల్, ఆరోగ్య అలవాట్లను మార్చుకున్నది. ఆమె ఇప్పుడు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుతున్నారు. అయితే సోషల్ మీడియా మాత్రం ఈ మొత్తం విషయం‌ను దీపిక – ప్రభాస్ – SRK ట్రయాంగిల్ వివాదంగా మరింత వేడెక్కిస్తోంది.

Exit mobile version