ZEE5 లిస్టులో త్వరలోనే ఓ తెలుగు సిరీస్ చేరనుంది. అదే.. ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ . అక్టోబర్ 31 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించారు. ఉదయ భాను ముఖ్య పాత్రను పోషించింది. ఇక వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి కనిపించటం లేదని వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషణ చేస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు.. మోసాలు.. వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి.
Also Read:Mass Jathara Director: పాట సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ నెరేషన్‌తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్‌తో నడిచే కథతో రూపొందింది. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలోని బలమైన బంధాలు, ప్రేమను ఇది ఆవిష్కరిస్తుంది’’ అన్నారు. నటి ఉదయభాను మాట్లాడుతూ ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గానే కాదు.. బలమైన ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది. ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అలాగే ఆసక్తికరమైన కథనంతో సిరీస్ బ్యాలెన్స్‌డ్‌గా మెప్పిస్తుంది. ఇదే యూనిక్ కంటెంట్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు.
