Site icon NTV Telugu

18న నాని ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియో!

నేచురల్ స్టార్‌ నాని, యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో సత్యదేవ్‌ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని ఈ మ్యూజిక్‌ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్‌ బిస్కేట్‌ ఈ సాంగ్‌ ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను భుజానకెత్తుకుంది.
కరోనా ఫస్ట్‌ అండ్‌ సెకండ వేవ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్‌ సాంగ్‌ను అంకితం ఇస్తున్నారు. విజయ్‌ బులగానిన్‌ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు. ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్‌ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్‌ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్‌ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్‌ విడుదల కానుంది.

Exit mobile version