NTV Telugu Site icon

Daaku Maharaj: డాకు మహారాజ్ ఛేజింగ్ సీన్ షూటింగ్ వీడియో లీక్!

Daakumaharaj

Daakumaharaj

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హిట్లపరంపర కొనసాగిస్తూ ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతంగా ఉందని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. చాలామంది సినిమా ధియేటర్ల నుంచి బయటకు వచ్చి ఒక మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా చూశామని అంటున్నారు.

Sankranthiki Vasthunam: సంక్రాంతి సినిమాల్లో ‘వస్తున్నాం’ ప్యూర్ డామినేషన్..

అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రక్షించే చిన్నారి వైష్ణవి పాత్ర బాగా పేలింది. పాప చూడడానికి బాగుండడమే కాదు అభినయం విషయంలో కూడా అద్భుతంగా నటించడంతో అసలు ఆమె ఎవరు అని అందరూ వెతుకుతున్నారు. అయితే ఆమె పేరు వేద అగర్వాల్ ఈ చిన్నారి తాజాగా సోషల్ మీడియాలో డాకు మహారాజ్ సినిమాలో కీలకమైన ఒక ఛేజింగ్ సీన్ బిహైండ్ ది సీన్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

Show comments