Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్ఫుల్ పాత్రలో అలరించనున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మైసూర్ షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ 29 నుంచే ప్రారంభం కానుంది. ముందుగా ఇతర కీలక నటీనటులతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మైసూర్ షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్లో బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్ సీన్లు, డ్రామా సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు. చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
-
Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
-
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?