Dhananjaya : టాలీవుడ్‌కు మరో యంగ్ విలన్ దొరికేశాడోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌కు మరో యంగ్ అండ్ డైనమిక్ విలన్ దొరికేశాడు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ లాంటి ఫేడవుటైన హీరోలంతా స్టార్ విలన్లుగా ఛేంజై.. పొరుగు ఇండస్ట్రీలో బిజీగా మారుతుంటే.. ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. హీరోగా సత్తా చాటుతూనే.. తెలుగులో విలన్‌గా బిజీ అవుతున్నాడు.. జాలిరెడ్డిగా పుష్ప చేతిలో తన్నులు తిన్న ధనుంజయ.. పుష్ప 2లో కూడా అదే క్యారెక్టర్‌లో కంటిన్యూ అవుతున్నాడు. జాలి రెడ్డిగానే తెలుగు ప్రేక్షకులకు రిజిస్టరైన ఈ శాండిల్ వుడ్ యాక్టర్.. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే.. టాలీవుడ్‌లో విలన్ రోల్స్‌కు సై అంటున్నాడు. అప్ కమింగ్ తెలుగు ఫిల్మ్ జీబ్రాలో కూడా నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
Allu Arjun: నందమూరి ఫ్యాన్స్ కి దగ్గరవుతున్న బన్నీ?
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
చందన సీమలో విలన్‌గా చేసి.. హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు ధనుంజయ. కానీ టాలీవుడ్ పిలవగానే మళ్లీ విలన్స్ రోల్స్ చేసేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. పుష్పతో జాలిరెడ్డిగా ఎలివేషన్, గ్రేట్ లాంచ్ దొరకడంతో.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్‌గా ఛేంజ్ అవుతున్నాడు. తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కనిపించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ హిట్టైతే పాన్ ఇండియన్ లెవల్లో గుర్తింపు వస్తుంది. సో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇండస్ట్రీతో మంచి ర్యాపో మెయిన్టైన్ చేస్తున్నాడు. ఫ్రెండ్లీ అట్మాస్పియర్ క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్లీ జరిగిన జీబ్రా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవిని, జీబ్రా హీరో సత్యదేవ్‌ను పొగడ్తలతో ముంచేసి.. స్పాంటెనిటీని ప్రదర్శించాడు.
జీబ్రా ఆర్ పుష్ప 2లో ఏదీ హిట్టయినా.. జాలి రెడ్డి.. జాలీగా ఇక్కడ విలన్ రోల్స్‌పై కర్చీఫ్ వేసుకోవచ్చు. టాలీవుడ్ హీరోలు సునీల్, రానాలు విలన్లుగా మారి.. కోలీవుడ్‌లో బిజీ అయిపోతుంటే.. ధనుంజయ్.. టాలీవుడ్ పై కన్నేశాడు.. హీరోయిజాన్ని రిస్కులో పెట్టి మరీ బ్యాడ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. చూడబోతే.. యంగ్ అండ్ అప్ కమింగ్ హీరోలను ఢీకొట్టబోయే స్టైలిష్ విలన్‌గా మారిపోతాడేమో చూడాలి..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!