గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Lokesh Kanagaraj : ఈ సారైనా హిట్టు దక్కేనా..?
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ సాధించింది . ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాత నాగవంశీ. ఈ నెల 23న సాయంత్రం 4 : 29 గంటలకు చిన్ని అనే సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో జనవరి 4న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో చూడాలి