NTV Telugu Site icon

Daaku Maharaaj: ఇది కదా ఫ్యాన్స్ కి కావల్సింది.. వాడు మనిషి కాదు వైల్డ్ యానిమల్

Daaku Trailer

Daaku Trailer

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను సితార బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నిర్మాత నాగవంశీ. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా రిలీజ్ ట్రైలర్ వదిలారు. మొదటి ట్రైలర్ కట్ భిన్నంగా ఉందని టాక్ రాగా తాజాగా వదిలిన ట్రైలర్ అయితే ఫాన్స్ కి ఫుల్ మీల్ పెట్టేలా ఉంది. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు ఒక బుల్లెట్ గాయం అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు వైల్డ్ అనిమల్, నువ్వు కామన్ మ్యాన్ వా ఐరన్ మ్యాన్ వా? నాకు శత్రువులు తక్కువ, ప్రాణమిచ్చే అభిమానులు ఎక్కువ అంటూ బాలయ్య గురించి, బాలయ్య చేత పలికించిన డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్

రాయలసీమ తెలుసా నీకు అది నా అడ్డా, ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో నేను మర్డర్స్ లో మాస్టర్ చేశా, నువ్వరిస్తే మొరగడం, నేను అరిస్తే గర్జించడం అంటూ కట్ చేసిన ట్రైలర్ కట్ బాలయ్య అభిమానులందరికీ ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈరోజు కొద్దిసేపట్లో హైదరాబాద్ వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Show comments