బాలీవుడ్‌లో ఫ్రెష్ పెయిర్స్ సినిమాలపై ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఇప్పుడు యాక్టర్లుగా టర్న్ కావడంతో తెరపైకి కొత్త జోడీలు కనువిందు చేయబోతున్నాయి. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, ఒకప్పటి స్టార్ నటీమణి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఆజాద్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జనవరి 17న థియేటర్లలోకి రిలీజౌతుంది మూవీ.
Also Read : Venky : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రన్‌టైమ్ లాక్
శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ సొంత ఇలాకాలో ఫేమ్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నిస్తున్నారు. జాన్వీ కపూర్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చుట్టేస్తుంటే చెల్లి నార్త్ బెల్ట్ పై ఫోకస్ చేస్తుంది. ఈ ఇద్దరూ కూడా క్రేజీ ప్రాజెక్టుల్లో కొత్త కొత్త హీరోలను లైన్లో పెడుతున్నారు. పరమ్ సుందరిలో సిద్దార్థ్ మల్హోత్రాతో జాన్వీ పాప జోడీ కడుతుంటే, ఖుషీ కపూర్ మరోవైపు ఖాన్స్ కొడుకులను లైన్లో పెట్టింది. లవ్యపాలో అమీర్ సన్ జునాయిద్ ఖాన్, నాదానీయన్‌లో ఇబ్రహీం అలీఖాన్ తో జోడీ కడుతుంది అతిలోక సుందరి చిన్న కుమార్తె. అలాగే మరికొన్ని కొత్త జంటలు తెరపై కనువిందు చేయబోతున్నాయి. సైడ్ యాక్టర్ నుండి హీరోగా ఫ్రూవ్ చేసుకున్న సిద్దాంత్ చతుర్వేదీతో ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు ముద్దుగుమ్మలు. యానిమల్ తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోయిన త్రిప్తి దిమ్రీతో పాటు వామికా గబ్బీలు ధడక్ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ చిత్రాలు చేస్తున్నారు. యంగ్ హీరో లక్ష్య్ లఖ్వానీతో తొలిసారిగా రొమాన్స్ చేయనుంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. మరీ ఈ ప్రెష్ పెయిర్ లో ఏదీ హిట్ పెయిర్ గా నిలుస్తుందో లేదో వెయిట్ అండ్ సీ..