NTV Telugu Site icon

Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు

Renuka Swamy Murder

Renuka Swamy Murder

Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దర్శన్, పవిత్రగౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నలుగురు నిందితులను భద్రతా కారణాల దృష్ట్యా తుమకూరు జైలుకు తరలించారు. అయితే రేణుకాస్వామి హత్య ఎలా జరిగింది? హత్యకు ముందు పట్టంగారే షెడ్‌లో ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడింది. హత్యకు ముందు రేణుక స్వామికి హంతకులు భారీగా ఆహారం తినిపించినట్లు తెలుస్తోంది.

Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!

రేణుకా స్వామికి బోలెడంత తినిపించి హంతకులు అతడిని చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. హత్యకు గురైన రేణుకాస్వామి కడుపులో జీర్ణం కాని ఆహారం ఉందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఆహారం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆహారం తిన్న తర్వాత హత్య జరిగినట్లు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు త్వరలోనే చార్జిషీట్‌ను సమర్పించనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి నిందితుడు. నటుడు దర్శన్ A2, పవన్ అలియాస్ A3 నిందితుడు, రాఘవేంద్ర నాలుగో నిందితుడు, నందీష్ A5, జగదీష్ అలియాస్ జగ్గా A6, అను A7, రవి A8, రాజు A9, వినయ్ A10, నాగరాజ్ A11, లక్ష్మణ్ A12, దీపక్ A13, ప్రదోష్ A14, కార్తీక్ A15, కేశవ్ మూర్తి .ఏ16గా, నిఖిల్ నాయక్‌పై ఏ17గా కేసు నమోదు చేశారు.

Show comments