NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పోలీసులు

Allu Arjun Bail

Allu Arjun Bail

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు కాగా 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు. దానికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లిన తర్వాత పోలీసులు ఈ అరెస్టు గురించి స్పందించారు . పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రీమియర్స్ మాత్రం ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్

డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో కలిసి సినిమా వీక్షించేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో టికెట్ లేని చాలామంది అల్లు అర్జున్ వస్తున్నాడని ఆయనను చూసేందుకు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందుగా అనుమతి తీసుకోకపోవడం కనీసం థియేటర్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం సహా అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు.