NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ కి మరో షాక్?

Jani Master

Jani Master

Court Dismissed Jani Master Bail Petetion: జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనను బలవంతం చేశాడని ముంబైలో రేప్ చేశాడని కేసు పెట్టడంతో జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం సహా పలు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని ప్రస్తుతం అరెస్టు చేసి హైదరాబాద్ చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇక జానీ ఈ కేసులో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

అయితే కోర్టు ఆయన బెయిలు తిరస్కరించింది.. ఆయనకు రంగారెడ్డి కోర్టులో చుక్క ఎదురయింది జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. నిజానికి గతంలో తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని బెయిల్ కోసం అప్లై చేయగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది. అయితే నేషనల్ అవార్డు రద్దు కావడంతో ఆయన బెయిల్ కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు.

Show comments