NTV Telugu Site icon

Coolie : సూపర్ స్టార్ రజనీ ఈజ్ బ్యాక్…

Cooli

Cooli

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో ముగించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు స్టార్ కాస్టింగ్ అంతా ఉన్నారు.

అలాగే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్నాడు అనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ చిత్ర వైజాగ్ షెడ్యూల్ తర్వాత అనారోగ్యానికి గురైన రజనీకాంత్ చికిత్స అనంతరం కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజులు పాటు వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు రజినీకాంత్. అయితే కూలీ లేటెస్ట్ షెడ్యూల్ చెన్నై లో స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించి భారీ సెట్స్ కూడా నిర్మించారు మేకర్స్. ఈ నేపథ్యంలో అనారోగ్యం పూర్తిగా కోలుకున్న సూపర్ స్టార్ట్ రజనీకాంత్ ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. రజనీ, అమిర్ ఖాన్ కాంబోలోని సీన్స్ తెరకెక్కించేలా అన్ని ఏర్పాట్లు చేసారు యూనిట్. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ, కథనాలు సాగనున్నాయి. శృతి హాసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ‘కూలీ’ కి సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.

Show comments