సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలి’ చిత్రం, సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్, అనిరుద్ధ్ స్వరరచనతో మరింత ఆకర్షణీయంగా మారింది. నాగార్జున, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, ఆమీర్ ఖాన్, రచిత రామ్, పూజ హెగ్డే వంటి అగ్రశ్రేణి తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు, ఇది తమిళంతో పాటు తెలుగు, మళయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడి, 240 దేశాలు మరియు భూభాగాలలో ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం కానుంది.
Also Read : Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు
థియేటర్స్ లో రిలీజ్ అయి రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తమిళనాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది కూలీ. ఈ సినిమా రైట్స్ ను రిలీజ్ కు ముందుగానే పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుంది అమెజాన్ ప్రైమ్. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన 28 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది కూలీ. ఈ విషయమై అధికారక ప్రకటన వచ్చింది.
