Site icon NTV Telugu

Coolie : ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..

Cooli

Cooli

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్‌’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్‌’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు.ఈ మూవీలో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా  ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read: Abhinaya : ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభిన‌య..కార్తీక్

ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానున్నట్లు చిత్రం బృదం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా.‘కూలి’ పై తెలుగు ప్రేక్షకులో కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో టీం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అత్యంత భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్ల వరకు మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలిదు కానీ ఒకవేల వారు డిమండ్ చేసినట్లుగా రూ.40 కోట్లకు అమ్మినట్లయితే, దాదాపు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి. అలా అయితేనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్‌ను అందుకునే అవకాశం ఉంటుంది.

Exit mobile version