NTV Telugu Site icon

Sandalwood: వరుస కాంట్రవర్సీల్లో శాండిల్ వుడ్

Kantara Movie

Kantara Movie

కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు.. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

కాంతారతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి.. దీని ప్రీక్వెల్.. కాంతార2తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ షూటింగ్‌లో ఓ చిన్న ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు బోల్తా పడి కొంత మందికి గాయాలయ్యాయి. షూటింగ్ తాత్కాలిక ఆపేశారు. అయితే ఈ రెండూ ఇష్యూస్‌లో హీరో ఇన్వాల్‌మెంట్ లేదు. కానీ తాజాగా ఓ వివాదం.. హీరో కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. బెనారస్ మూవీతో ఫేమైన జైద్.. కర్ణాటక మంత్రి జమీర్ సన్. ప్రజెంట్.. కల్ట్ అనే మూవీని చేస్తున్నాడు.

కల్ట్ షూటింగ్ చిత్రదుర్గలో జరుపుకుంటోంది. సడెన్‌గా ఈ మూవీలోని డ్రోన్ టెక్నిషియన్ ఆత్మహత్యకు యత్నించాడు. షూటింగ్ టైంలో డ్రోన్ విరిగిపోతే.. టెక్నీషియన్ సంతోష్‌కు డబ్బులు చెల్లించకుండా హింసకు గురి చేసింది యూనిట్. గతంలో మార్టిన్, యువ చిత్రాలకు డ్రోన్ టెక్నీషియన్‌గా వ్యవహరించిన సంతోష్.. ఇలా చేసుకోవడంతో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. సంతోష్ బ్రదర్ కంప్లంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ సంతోష్.. హీరోపై తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. డ్రోన్ పోగా.. డబ్బులు చెల్లించాలని ఈ మూవీ నిర్మాత కం హీరో జైద్ ఖాన్ క్యారవాన్‌కు వెళ్లి మనీ అడిగితే.. అవమానించి.. కాగితంపై బలవంతంగా యూనిట్ తప్పులేదని సంతకం చేయించాడని ఆరోపిస్తున్నాడు. ఈ వివాదం కర్ణాటకలో హాట్ టాపిక్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతోన్న హీరోపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడంతో శాండిల్ వుడ్ మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటుంది. మరీ ఈ కేసు ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి..?

Show comments