Sandalwood: వరుస కాంట్రవర్సీల్లో శాండిల్ వుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు.. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.
కాంతారతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి.. దీని ప్రీక్వెల్.. కాంతార2తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ షూటింగ్‌లో ఓ చిన్న ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు బోల్తా పడి కొంత మందికి గాయాలయ్యాయి. షూటింగ్ తాత్కాలిక ఆపేశారు. అయితే ఈ రెండూ ఇష్యూస్‌లో హీరో ఇన్వాల్‌మెంట్ లేదు. కానీ తాజాగా ఓ వివాదం.. హీరో కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. బెనారస్ మూవీతో ఫేమైన జైద్.. కర్ణాటక మంత్రి జమీర్ సన్. ప్రజెంట్.. కల్ట్ అనే మూవీని చేస్తున్నాడు.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
కల్ట్ షూటింగ్ చిత్రదుర్గలో జరుపుకుంటోంది. సడెన్‌గా ఈ మూవీలోని డ్రోన్ టెక్నిషియన్ ఆత్మహత్యకు యత్నించాడు. షూటింగ్ టైంలో డ్రోన్ విరిగిపోతే.. టెక్నీషియన్ సంతోష్‌కు డబ్బులు చెల్లించకుండా హింసకు గురి చేసింది యూనిట్. గతంలో మార్టిన్, యువ చిత్రాలకు డ్రోన్ టెక్నీషియన్‌గా వ్యవహరించిన సంతోష్.. ఇలా చేసుకోవడంతో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. సంతోష్ బ్రదర్ కంప్లంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ సంతోష్.. హీరోపై తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. డ్రోన్ పోగా.. డబ్బులు చెల్లించాలని ఈ మూవీ నిర్మాత కం హీరో జైద్ ఖాన్ క్యారవాన్‌కు వెళ్లి మనీ అడిగితే.. అవమానించి.. కాగితంపై బలవంతంగా యూనిట్ తప్పులేదని సంతకం చేయించాడని ఆరోపిస్తున్నాడు. ఈ వివాదం కర్ణాటకలో హాట్ టాపిక్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతోన్న హీరోపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడంతో శాండిల్ వుడ్ మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటుంది. మరీ ఈ కేసు ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి..?
- Tags
- Kannada Movies
- Sandalwood
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!