మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు.హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్రలో కనిపించాడు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం స్పెషల్ గా నిన్న మలయాళ వర్షన్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మోహన్ లాల్ సినిమాతో పోటీగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కథ, టేకింగ్, మేకింగ్ ఇలా అన్ని విభాగాలలో ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి అద్భుత స్పందన రాబట్టింది.డైరెక్టర్ డొమినిక్ అరుణ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29న అనగా నేడు తెలుగులో విడుదల కావాల్సి ఉంది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. అయితే నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా ఉదయం ఆటలు క్యాన్సిల్ అయ్యాయి. నిర్మాతల నుండి తెలుగు కంటెంట్ రావడం ఆలస్యం వల్ల ఉదయం షోస్ క్యాన్సెల్ అయ్యాయి. అనుకున్న టైమ్ కు గనక వస్తే మాట్నీ షోస్ నుండి షోస్ స్టార్ట్ అవుతాయి లేదనే ఈవెనింగ్ షోస్ నుండి సినిమా ప్రదర్శనలు ఉండొచ్చు. మేకర్స్ నుండి కంటెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
