బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ పై ముంబై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. అతడిపై ఇప్పటికే కేసు నమోదు కాగా, నిన్న చెంబూరు పోలీసులు నోటీసు లిచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. రణ్వీర్ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేదు. ఆగస్టు 16న తిరిగివస్తానని రణ్వీర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ పోలీసులు వెళ్లి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ కోసం ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. రణ్ వీర్ సింగ్ మహిళల సెంటిమెంట్లను దెబ్బతీశాడని ఎన్జీవో ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.
read also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి 11 సెట్ల రహస్య పత్రాలు స్వాధీనం
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ ఈర్ సింగ్ ఇటీవలే పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్ గా మారాయి. రణ్ వీర్ ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. రణ్ వీర్ సింగ్ చేసిన ఫోటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలు మహిళలు సైతం ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ ప్రకారం యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ టాప్ హీరో ఇలా ఫొటో షూట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Ranveer Singh Photoshoot: న్యూడ్ ఫొటో షూట్.. ఆగస్టు 22న హాజరు కావాలని సమన్లు
